ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై ఆల్ రౌండ్ అల్లుడికి .... షాక్

sports |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 05:27 PM

గత ఐపీఎల్ సీజన్ లో అద్భుత ప్రదర్శన ఎవరిదంటే.. చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ది అని అందరూ అంటారేమో..? కానీ, అభిమానుల మనసులు గెలుచుకున్నది మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. వరుసగా ఐదారు మ్యాచ్ లు ఓడిపోయినా.. ఆపై ఆరు మ్యాచ్ లు గెలిచి నాకౌట్ కు చేరింది.దీంతో ఈ సాలా (ఈ సంవత్సరం కూడా) కన్నీళ్లే అంటూ వెనుదిరిగింది. అయితే, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ లో ఓ ఆటగాడు మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంతటి విధ్వంసకారుడో చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ లో అతడు అఫ్ఘానిస్థాన్ పై సాధించిన డబుల్ సెంచరీ అతి గొప్ప వన్డే ఇన్నింగ్స్ లో ఒకటి అనడంలో సందేహం లేదు.ఏడాది ఐపీఎల్ లో బెంగళూరు తరఫున దారుణ ప్రదర్శన చేశాడు.వచ్చే సీజన్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమిళనాడు అల్లుడైన గ్లెన్ మ్యాక్స్ వెల్ ను వదిలించుకోవాలని చూస్తోందట.దీంతో వచ్చే సీజన్ లో అయినా.. బెంగళూరు ఈ సాలా కప్ నమదే (ఈ సంవత్సరం కప్ మనదే) ఆశ నెరవేరుతుందోమో చూద్దాం..?


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com