ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెడ్‌,మ్యాక్స్‌వెల్‌ మెరుపులు

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 03:11 PM

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024లో వాషింగ్టన్‌ ఫ్రీడం ఫైనల్‌కు చేరింది. ఇవాళ (జులై 26) జరిగిన క్వాలిఫయర్‌లో ఆ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనికార్న్స్‌.. రచిన్‌ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్‌ (4-0-46-3), నేత్రావల్కర్‌ (4-0-23-2), ఫెర్గూసన్‌ (3.2-0-24-1) ధాటి​​కి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో హసన్‌ ఖాన్‌ (57) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.


అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​​కి దిగిన వాషింగ్టన్‌.. ట్రవిస్‌ హెడ్‌ (44 బంతుల్లో 77 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (23 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో సునయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది.వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ 1, ఆండ్రియస్‌ గౌస్‌ (9), రచిన్‌ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. యూనికార్న్స్‌ బౌలర్లలో హసన్‌ ఖాన్‌ 2, పాట్‌ కమిన్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. యూనికార్న్స్‌ రేపు జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్‌ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com