ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, లోకేష్‌ల వద్ద ప్రశంసల కోసమే ఆమె ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 07:51 PM

హోం మంత్రి వంగలపూడి అనిత మాటలు వింటుంటే.. ఆమె చాలా ప్రస్టేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆమె పనితీరుపై హెచ్చిరించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలోనే.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయస్‌ జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వనిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ సీఎం వైయస్‌ జగన్‌ను హోం మంత్రి ఏకవచనంతో సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబు, లోకేష్‌ల వద్ద ప్రశంసల కోసమే నోటికొచ్చినట్లు దిగజారి మాట్లాడ్డం సరికాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com