ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియా పుణ్యం... ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనను సీన్ రీక్రియేట్ చేసిన చిన్నారులు

international |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 10:32 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరపడం, ఆ తర్వాత ఆయన కుప్పకూలిపోవడం ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రపంచ నలుమూలలకూ చేరిపోయాయి. అయితే ఈ ఘటనను ఉగాండా దేశానికి చెందిన కొందరు చిన్నారులు సీన్ రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసినట్లుగా ఉన్న ఓ సెట్‌ను రూపొందించారు. స్టేజీ, దానిపైన పోడియం, మైక్ అన్నీ కరెక్ట్‌గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ట్రంప్ లాగా ఓ బుడ్డోడు యాక్టింగ్ చేయగా.. అతని వెనుక సెక్యూరిటీ గార్డుల్లాగా మరికొందరు నిలబడి ఉన్నారు. ఇక చెక్కతో చేసిన తుపాకులు.. ఆ చిన్నారుల వద్ద ఉన్నారు.


ఇక సీరియస్‌గా డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఎలాంటి ఆడియో, వీడియో ఉందో సరిగ్గా అలాంటి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తోపాటు వీడియోను కూడా రూపొందించారు. చివరికి బుల్లెట్ శబ్దాలు కూడా వినిపించేలా ఆ వీడియోను రికార్డ్ చేశారు. ఇక దుండగుడు కాల్పులు జరిపిన తర్వాత అంతా కిందికి వంగినట్లు చేశారు. అనంతరం పైకి లేచి ట్రంప్ అరిచినట్లుగా.. ఫైట్, ఫైట్ అంటూ ట్రంప్ పాత్ర పోషిస్తున్న ఓ బాలుడు అనడం గమనార్హం. వెంటనే సెక్యూరిటీగా ఉన్న మరికొందరు చిన్నారులు.. తమ చేతుల్లో చెక్క తుపాకులను పట్టుకుని.. ఆ చిన్నారిని అక్కడి నుంచి తీసుకువెళ్తున్నట్లు వీడియోను రికార్డ్ చేశారు. ఈ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది.


మరోవైపు.. ఉగాండా చిన్నారులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం.. ఇలాంటి హింసాత్మకమైన, సున్నితమైన ఘటనలకు సంబంధించిన వాటిని చిన్న పిల్లలు రీ క్రియేట్ చేయడం మంచిది కాదని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఆ చిన్నారుల్లో ఉన్న టాలెంట్ బయటపడిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com