ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్‌పై మండిపడ్డ మంత్రి సత్యకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 02:38 PM

ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైర్లు, ఆయనను మాజీ మంత్రి కేటీఆర్  బ్లాక్ చేయడం.. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఏపీ ఎన్నికల్లో జగన్  ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన ఎక్స్ అకౌంట్‌ను కేటీఆర్ బ్లాక్ చేసేశారు. ఏపీలో వైఎస్సార్పీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని.. అలాగే నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ధర్మవరంలో ఎలా ఓటమి చెందారనేది అర్ధం కావడం లేదంటూ కేటీఆర్ అన్నారు. దీనిపై ఏపీ మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ.. తనదైన శైలిలో కేటీఆర్‌పై మాటల దాడికి దిగారు. దీంతో ఏపీ మంత్రి వ్యాఖ్యలను తట్టుకోలేక మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌‌ను బ్లాక్ చేసేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com