ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.5.84 లక్షలకే కొత్త కారు.. ఆపై రూ.58 వేల డిస్కౌంట్.. మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్!

business |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 09:24 PM

దేశీయ దిగ్గజ ప్రయాణికుల వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జులై, 2024లో వివిధ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు కల్పిస్తోంది. తమ కంపెనీ నెక్సా షోరూముల ద్వార విక్రయించే కార్లపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. చిన్న ఫ్యామిలీ కోసం మంచి కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కేవలం రూ.5.84 లక్షలకే కొత్త కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ కారుపై ఏకంగా రూ. 58 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం జులై 2024 ఆఫర్ కింద మారుతీ సుజుకీ నెక్సా షోరూముల ద్వారా వివిధ మోడళ్లు మారుతీ సుజుకీ ఇగ్నిస్, బలెనో, ఫ్రాంక్స్, సియాజ్, జిమ్ని, ఎక్స్ఎల్6, ఇన్విక్టో, గ్రాండ్ విటారా వంటి వాటిపై భారీ ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్ జులై నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు నెలాఖరు లోపు బుక్ చేసుకోవడం మంచింది.


మారుతీ ఇగ్నిస్ డిస్కౌంట్ ఆఫర్


మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన చిన్న కారు మారుతీ ఇగ్నిస్పై అత్యధికంగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ జులై నెలలో ఇగ్నిస్ కారు కొనుగోలు చేసినట్లయితే రూ. 58 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇందులో నేరుగా రూ. 40 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ. 15 వేల ఎక్స్చేంజీ బోనస్, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ బేస్ మోడల్ పై ఎక్స్ షోరూమ్ ధర రూ. 5,85,000గా ఉంది. దానిపై ఆర్‌టీఓ రూ.81,760, ఇన్సూరెన్స్ రూ. 35,152, ఇతర ఖర్చులు రూ.500 కలుపుకొంటే మొత్తంగా హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ రూ. 7 లక్షలు అవుతుంది.


అలాగే మారుతీ బలెనో కారుపై సైతం రూ.58 వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఈ జులై నెలలో బలెనో కారు కొంటే రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆపైన రూ.15 వేల ఎక్స్చేంజీ బోనస్ వస్తుండగా.. రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కారు బేస్ మోడల్ ధర హైదరాబాద్‌లో రూ. 6.66 లక్షల నుంచి మొదలవుతోంది. బలెనో డెల్టా మోడల్ అయితే రూ. 7.50 లక్షల నుంచి మొదలవుతోంది. అలాగే బలెనో జెటా ధర రూ. 8.43 లక్షల నుంచి మొదలవుతోంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com