ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఎమ్మెల్యేకి పితృవియోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 04:41 PM

అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తండ్రి సత్యనారాయణ కారుకు ప్రమాదం జరిగింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సబ్బవరం అసకపల్లి మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం ప్రమాదవశాత్తు పల్టీకొట్టింది. దీంతో కారులో ఉన్న సత్యనారాయణ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్థానికుల సహాయంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే విజయ్‌కు స్థానికులు సమాచారం అందించారు. జనసేన కార్యకర్తలు, కూటమి నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com