సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండు కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది నిబద్దతతో వ్యవహరించారని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారు అన్నారు.