శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్, 108లలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.