ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష పుస్తకాలు చదివిన దత్తపుత్రుడికి ఆమాత్రం తెలియదా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 08:15 PM

చంద్రబాబు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను చదువుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ  గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి  సూచించారు.  ఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ....  చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అన్నా,రాజ్యాంగం అన్నా,ఎన్నికల కమీషన్ అన్నా ఏమాత్రం గౌరవం లేదు. ఆ వ్యవస్ధలను లెక్కచేయకుండా చంద్రబాబు సొంత రాజ్యాంగం అమలుచేస్తున్నాడు. చంద్రబాబు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని వైయస్సార్ సిపి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడం ఎన్నికల కమీషన్ కూడా దీనిపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన వివరణ కోరినా కూడా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ,40  ఏళ్ల  రాజకీయఅనుభవం ఉన్న చంద్రబాబుకు మోడల్  కోడ్  ఆఫ్  కండక్ట్  తెలియదా. ఎం  సి సి  నిబంధనలు  ఒక్క సారి  చదవండి  చంద్రబాబు.. లేకపోతే  లక్ష  పుస్తకాలు  చదివిన మీ దత్తపుత్రుడు పవన్  కళ్యాణ్  ను  అడగండి....... ఎం సి సి  నియమాలకు  విరుద్ధంగా భువనేశ్వరి  పర్యటనలు  చేసి  చెక్కులు  పంచుతున్నారని  కూడా  ఈసీ కి   చెప్పాము.ఈసి సంబంధిత కలెక్టర్ ద్వారా నోటీసులు పంపింది. భువనేశ్వరి ఆ విధంగా చేయడం ఓట్లు కొనడమే అవుతుంది. టిడిపి ఎన్ ఆర్ ఐ యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం సైతం ఓట్ల కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారు.గ్రామాలలో బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీ,పేదలను మభ్యపుచ్చే ప్రయత్నాలు,ప్రలోభపరిచే కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబుకు వార్దక్యం వల్ల నాలెడ్జ్ లేకపోతే స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటిలో స్విమ్మింగ్ ఫూల్స్ లో జలకాలాడుతూ చదివిన లోకేష్ ను అడిగి ఎన్నికల నియమావళి తెలుసుకోవచ్చు. చంద్రబాబు ఇప్పటికైనా ఎన్నికల నియమావళిని తెలుసుకుంటే బాగుంటుంది. దొంగతనం చేసిన దొంగ...దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా చంద్రబాబు ఎంసిసిని ఉల్లంఘిస్తూ తన పచ్చమీడియా,పచ్చపత్రికలలో మాత్రం జగన్ గారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రజలు ఆల్ రెడీ జగన్ గారిని గెలిపించేందుకు డిసైడ్ అయిన విషయాన్ని చంద్రబాబు అండ్ కో గుర్తిస్తే మంచిది అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com