జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నామినేషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేశారు పపన్. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించి కీలక వివరాలు పొందుపర్చారు. అధికారిక సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ. 114.76 కోట్లు. ప్రభుత్వానికి పవన్ చెల్లించిన పన్నులు రూ. 73.92 కోట్లు. ప్రజలకు, చారిటీలకు అందజేసిన విరాళాలు రూ. 20 కోట్లు. పవన్ కల్యాణ్ అప్పులు రూ. 64.26 కోట్లు. ఆదాయ పన్నుగా రూ. 47 కోట్లు, జీఎస్టీకి రూ. 5 కోట్లు చెల్లించారు. అప్పుల్లో వివిధ బ్యాంకుల నుంచి రూ. 17.56 కోట్లు తీసుకోగా.. వ్యక్తుల వద్ద నుంచి తీసుకున్నవి రూ. 46 లక్షల అప్పు ఉన్నాయి.