ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్ఓ కార్యాలయంలో ఆర్ఓ సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు. ఒంగోలుకు వైసిపి అభ్యర్థి బాలినేని శ్రీనివాసులు రెడ్డి 2 సెట్లు దాఖలు చేశారు. అలాగే బాలినేని శ్రీనివాసులు రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి మరో నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా రవిబాబు, అక్కరాజు నిర్మల్, తిరుపతి స్వాములు నామినేషన్లు వేశారు.