ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌లో భారీ వర్షాలు...హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల

national |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 11:04 PM

భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలమైంది. ఏడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. ఎవరైనా దుబాయ్‌లో చిక్కుకుపోతే, వారు +971501205172, +971569950590, +971507347676, +971585754213లకు నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని తెలిపింది. దుబాయ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ హెల్ప్ లైన్ నెంబర్లు కొనసాగుతాయని వెల్లడించింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com