ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. టికెట్ దక్కని టీడీపీ నేతల కోసం ప్రత్యేకంగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 08:39 PM

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టికెట్ దక్కని నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.. అలాగే ఇటీవల పార్టీలో చేరిన ముఖ్యమైన నేతలకు కూడా పదవుల్ని అప్పగించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా చిలకలూరిపేటకు చెందిన మల్లెల రాజేశ్‌నాయుడిని ఆ పార్టీ నియమించింది. ఇటీవలి వరకు వైఎస్సార్‌సీపీలీలో ఉన్న ఆయన.. ఆ పార్టీ చిలకలూరిపేట సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. టికెట్‌ ఇప్పిస్తానని మంత్రి విడదల రజిని తన వద్ద రూ.5 కోట్లు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రజిని పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా రాజేశ్‌నాయుడికి బాధ్యతలు అప్పగించారు.


అనంతపురం అర్బన్‌ టికెట్‌ ఆశించిన వైకుంఠం ప్రభాకర్‌ చౌదరిని జోన్‌-5 ఎన్నికల సమన్వయకర్త బాధ్యతలతో పాటు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పుట్టపర్తి టికెట్‌ ఆశించిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పను అనంతపురం, ఎమ్మెల్సీ బీటీ నాయుడిని కర్నూలు, ఏరాసు ప్రతాప్‌రెడ్డిని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ప్రకటించారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి సమన్వయకర్తలుగా గుండుమల తిప్పేస్వామి, పూల నాగరాజులకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ఆలూరు, పత్తికొండ అసెంబ్లీ స్థానాలకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు, ఎమ్మిగనూరుకు డా. సంజీవకుమార్‌, ఆళ్లగడ్డకు కేవీ సుబ్బారెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గానికి శీతంరాజు సుధాకర్‌, దెందులూరుకు దివి శివరాం, ఆత్మకూరుకు ఎస్‌సీవీ నాయుడు, ఉదయగిరికి వేనాటి సతీష్‌రెడ్డి, పుట్టపర్తికి దాసరి నరసింహమూర్తి, చీరాలకు ముప్పవరపు వీరయ్య చౌదరిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.


మరోవైపు టీడీపీ పలువురు నేతల్ని ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శలుగా, కార్యదర్శులుగా ప్రకటించారు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల సంఘం, పత్రికా సమావేశాల సమన్వయకర్తగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావును నియమించారు. . వీరభద్రరావుకు ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణతోపాటు పార్టీ గెలుపుకోసం కృషి చేసే కీలక బాధ్యతలను అప్పగించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, దాడి రత్నాకర్‌కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. నర్సీపట్నానికి చెందిన బోలెం ముత్యాలపాపను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉత్వర్వులు జారీచేశారు.


అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల తాతయ్యబాబు నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. టీడీపీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అభ్యర్థిత్వంపై మొగ్గు చూపడంతో తాతయ్యబాబు టికెట్‌ రాలేదు. దీంతో ఆయన విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిశారు. అధినేత ఇచ్చిన హామీ మేరకు తాజాగా పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్‌ను నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు. హిందూపురం నియోజకవర్గానికి చెందిన వడ్డే అంజనప్పను హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన పాలకుర్తి తిక్కారెడ్డిని కర్నూలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.


టీడీపీ ఉపాధ్యక్షులుగా ఆదోని నియోజకవర్గానికి చెందిన మీనాక్షి నాయుడు, ఉదయగిరికి చెందిన కంభం విజయరామిరెడ్డి, కావలికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడులను నియమించారు. అలాగే సత్తెనపల్లికి చెందిన కోడెల శివరామకృష్ణను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. ఎస్ కోటకు చెందిన గొంప కృష్ణ, చిత్తూరుకు చెందిన వెంకిటీల సురేంద్ర కుమార్‌లను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియమించారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా రైల్వే కోడూరుకు చెందిన కస్తూరవి విశ్వనాథ నాయుడు, మైలవరంనకు చెందిన బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ వెస్ట్‌కు చెందిన ఎంఎస్ బేగ్‌, కాకినాడ సిటీకి చెందిన సుంకర పావని, విజయవాడ వెస్ట్‌కు చెందిన బొప్పన భవ కుమార్‌, తిరువూరు నియోజకవర్గానికి చెందిన శావల దేవదత్, నరసరావుపేటకు చెందిన నల్లపాటి రామచంద్రప్రసాద్, కదిరికి చెందిన పవన్ కుమార్ రెడ్డి, అనకాపల్లి బుద్ధా నాగ జగదీష్, అనకాపల్లికి చెందిన దాడి రత్నాకర్, గుంటూరు వెస్ట్‌కు చెందిన తాడిశెట్టి మురళీమోహన్, ఆలూరుకు చెందిన వైకుంఠం శివ ప్రసాద్, అనంతపురం అర్బన్‌కు చెందిన కురువబ బుల్లే శివబాల, పత్తికొండకు చెందిన తుగ్గలి నాగేంద్రలను నియమించారు.


కడపకు చెందిన సూదా దుర్గా ప్రసాద్, కడపకు పెందిన పొన్నోలు రాంప్రసాద్ రెడ్డి, ఆదోని ఉమ్మి సలీం, బనగానపల్లెకు చెందిన కాటసాని చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా చల్లా విజయ భాస్కర్ రెడ్డి, కనిగిరికి చెందిన కోటపాటి జనార్దన్, ఉదయగిరికి చెందిన మన్నేటి వెంకట్ రెడ్డి, ఆలూరుకుచెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి, కదిరికి చెందిన గాజుల శివరాం ప్రతాప్, పీ గన్నవరం నియోజకవర్గానికి చెందిన బోళ్ల వెంకట కృష్ణ ప్రసాద్, మాచర్లకు చెందిన కళ్లం రామాంజి రెడ్డి, మాచర్లకు చెందిన పంగలూరు అంజయ్య, కర్నూలుకు చెందిన వేముల సుమన్ చైదరి, ఎమ్మిగనూరుకు చెందిన కొంకతి లక్ష్మీనారాయణ, నర్సీపట్నంనకు చెందిన బోలెం ముత్యాలపాప, ఎస్‌కోటకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి, ఎస్‌కోటకే చెందిన రాయవరపు చంద్రశేఖరరావు, రాజంపేటకు చెందిన ఇడమడకల కుమార్, కళ్యాణదుర్గంనకు చెందిన దాసరి నరసింహమూర్తిలను రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. కోడమూరుకు చెందిన ఆకెపోగు ప్రభాకర్‌ను కర్నూలు పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆదోనికి చెందిన గుడిసె ఆది కృష్ణమ్మను రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి, ఎమ్మిగమనూరుకు చెందిన మాచాని సోమనాథ్‌లను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కర్యాదర్శులుగా నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com