సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. బస్సుపై ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.