ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజలను సైకో జగన్ జలగల్లా పీల్చుతున్నారని బహిరంగ సభలో ఫైర్ అయ్యారు. తల్లి, చెల్లిని రోడ్డుపైకి తీసుకువచ్చి సొంత బాబాయ్ ను హత్య చేసిన వారిని కాపాడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో చంద్రబాబు సాగునీరు పారిస్తే జగన్ మాత్రం రక్తం పారిస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ తో అన్ని వర్గాలను నిండా ముంచారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న బాలకృష్ణ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.