డబ్బున్నోడికే టీడీపీలో టికెట్, పేదవాడికి వైసీపీలో టికెట్ ఇచ్చారని రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. శనివారం రాజాం పెనుబాకలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఐదేళ్లలో టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా, ఎక్కడో వ్యాపారం చేసుకునే వ్యక్తిని టిడిపి కూటమి అభ్యర్ధిగా టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు.ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ వైపే ప్రజలు ఉన్నారన్నారు.