రణస్థలం మండలం కొండములగాం, జేఆర్ పురం పంచాయతీల్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల వద్దకే పరిపాలన అందించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ను గెలిపిస్తే, ప్రజలు ఇంటి వద్దకే నేరుగా పథకాలు అందుతాయన్నారు.