అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ అసమ్మతి నేత, కొత్తపల్లె సర్పంచి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో.. టీడీపీలో చేరబోతున్నట్లు శివచంద్రారెడ్డి ప్రకటించారు. అయితే సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన శివచంద్రారెడ్డి రాజీనామాతో వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.