ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన ఎవరి చేతుల్లో ఉంది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:47 AM

పరిపాలన ఎన్నికల కమిషన్‌ చేతిలో ఉందా? ఇంకా జగన్‌రెడ్డి చేతిలోనే ఉందా..? అనేది ఈసీ తేల్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. సీఈవోని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలోని గోడౌన్‌లో పెద్ద డంపు పట్టుకుని, అధికారులే ఆశ్చర్యపోతే.. తిరుపతి జిల్లా కలెక్టర్‌కి చీమకుట్టినట్లైనా లేదన్నారు. మా పార్టీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ఆయన కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆ కలెక్టర్‌కు ఎన్నికల విధులు అప్పగిస్తే సమన్యాయం జరగదని అన్నారు. దేవాలయాల్లో పనిచేసే అధికారులకు ఎన్నికల డ్యూటీలు వేయవద్దని కోరినట్లు బీజేపీ నేత పాతూరి నాగభూషణం కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com