ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం 16 పరుగలకే ఆలౌట్‌

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 11:33 AM

జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్‌తో జరిగిన ఫైనల్లో ఈగిల్స్ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్ చెత్త రికార్డు సృష్టించింది. బిగ్ బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ చెత్త రికార్డుతో అగ్రస్థానంలో ఉంది. బిగ్ బాష్ లీగ్-2022లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. డర్హామ్ బ్యాటర్లలో బాస్ డి లీడ్ (58) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మస్టర్డ్ (46), రాబిన్సన్ (49) పరుగులు చేశారు. ఆ తర్వాత 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగిల్స్ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com