ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.