ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు విజయం

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 11:02 PM

నేడు మూడో టీ20లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో  ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆ తరువాత 223 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మ్యాక్స్ వెల్ 104 పరుగులు, ట్రావిస్ హెడ్ 35, వేడ్ 28 పరుగులు చేసారు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com