ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెల 5న పోలవరం పై కేంద్ర సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 05:37 PM

 పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై వచ్చే నెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది. ప్రాజెక్టు తొలిదశ 41.15 మీటర్ల కాంటూరులో సవరించిన అంచనా వ్యయం రూ.15,505 కోట్లపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన పోలవరం సవరించిన అంచనా వ్యయ కమిటీ ఇప్పటికే రెండు దఫాలుగా సమీక్షించింది. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నెల 17వ తేదీన కమిటీ సమావేశమైనా నిర్ణయాన్ని వెల్లడించలేదు. కాగా ఈ నెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్షించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేవర్షి ముఖర్జీ భావించారు. కానీ ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. వచ్చే నెల ఐదో తేదీన ముఖాముఖీగా నిర్వహిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖకు సమాచారం అందింది. ఈ సమీక్షలోగా 41.15 మీటర్ల కాంటూరులో దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ సీపేజీ నివారణ, గైడ్‌బండ్‌ పనులకు సంబంధించి కార్యాచరణను ఖారారు చేసే వీలుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com