మార్కాపురం పట్టణంలోని 15వ వార్డులో పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకే అధికారాన్ని వాడుకుంటోందన్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు, క్లస్టర్ ఇన్‌చార్జులు మల్లికార్జున, కొప్పుల శీను, మస్తాన్, 15వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.