విద్యార్థుల భవిష్యత్‌కు చంద్రబాబు గ్యారెంటీగా ఉంటారని, విద్యార్థులు తమ ఓటును తెలుగుదేశం పార్టీకి వేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోరారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు షేక్ అమ్రుల్లా ఆధ్వర్యంలో ‘విద్యార్థి మేలుకో.. భవిష్యత్ మార్చుకో..’ కార్యక్రమ పోస్టర్లను సోమవారం ఆయన నగరంలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 82 లక్షల మంది అమ్మఒడి పథకానికి అర్హులుగా ఉంటే 40 లక్షల మందికి కూడా సాయం అందడం లేదని విమర్శించారు. 4709 పాఠశాలలను రద్దు చేయడం, 50 వేల టీచర్ పోస్టుల భర్తీని గాలికొదిలేసిన ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. విద్యార్థులను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత టీఎన్‌ఎ్‌సఎ్‌ఫపై ఉందని అజీజ్ సూచించారు.