ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం కొండపై బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:07 PM

టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ మంజూరు కావాలంటూ సింహాచలం కొండపై మాజీ మంత్రి, టీడీపీ నేత  బండారు సత్యనారాయణమూర్తి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంలో అక్కడికి చేరిన పోలీసులు ఆయనని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సింహాచలం కొండమీద కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారా అంటూ పోలీసులతో అయన వాదనకు దిగారు. జైల్లో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆయన త్వరగా విడుదల కావాలని కోరుకోవడానికి సింహాచలం వస్తే పోలీసులు తమను అరెస్ట్ చేయడం చాలా దారుణమని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com