విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం దర్శించుకున్నారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఒక బిడ్డకు మనసు బాలేనప్పుడు తల్లిదండ్రులు వద్దకు వెళతారని అందుకే నా బాధ చెప్పుకో వడానికే అమ్మవారి దగ్గరకు వచ్చానని పేర్కొన్నారు. అమ్మవారి ని నేను కోరింది ఒక్కటే నా భర్తను రక్షించమని, ఆయనకి మనోధైర్యం ఇవ్వమని కోరానని వెల్లడించారు.