ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై యూపీ సర్కార్ కు నివేదిక కోరిన సుప్రీం

national |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 10:03 PM

దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారిన గ్యాంగస్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నివేదిక కోరింది. అలాగే, అతడి కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌పై కూడా నివేదిక అందజేయాలని యూపీ పోలీసులను ఆదేశించింది. పోలీస్ కస్టడీలో ఉండగానే ఈ హత్యలు జరగడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్‌లను ఏప్రిల్ 15 న పోలీసులు సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళుతుండగా ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. జర్నలిస్టులుగా నటించిన దుండగులు చాలా దగ్గర నుంచి పలు రౌండ్లు కాల్పులు జరిపి హత్యచేసిన అనంతరం లొంగిపోయారు.


‘అతీక్, అష్రఫ్‌లను తీసుకెళ్తున్నట్టు వారికి ఎలా తెలిసింది? మేము టీవీలో చూశాం. అతిక్ అహ్మద్, అతని సోదరుడిని అంబులెన్స్‌లో ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు? వారిని ఎందుకు నడిపించి జనంలో నుంచి తీసుకెళ్లారు’’ అని కోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల మేరకు సోదరులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నట్లు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ‘న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని రెండు రోజులకొకసారి వైద్యపరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉంది.. కాబట్టి పత్రికలకు తెలిసింది. ఈ విషయాన్ని పరిశీలించేందుకు కమిషన్‌ను నియమించాం’ అని పేర్కొంది.


‘ఈ వ్యక్తి (అతిక్ అహ్మద్), అతని కుటుంబం మొత్తం గత 30 సంవత్సరాలుగా హేయమైన నేరాల్లో పాల్గొన్నారు.. ఈ సంఘటన ముఖ్యంగా ఒక భయంకరమైన సంఘటన.. మేము హంతకులను పట్టుకున్నాం.. ఫేమ్ కోసమే హత్యలు చేశామని వారు చెప్పారు’ అని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ లాయర్


‘ఈ హత్యలను అందరూ టీవీలో చూశారు. హంతకులు న్యూస్ రిపోర్టర్ల వేషంలో వచ్చారు. వారి వద్ద పాస్‌లు ఉన్నాయి.. కెమెరాలు ఉన్నాయి.. గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయి అవి నకిలీవని తేలింది. అక్కడ 50 మంది, బయట ఎక్కువ మంది ఉన్నారు. ఈ విధంగా వారు హత్య చేయగలిగారు’ అని వివరించారు.


యూపీలో పేరుమోసిన గ్యాంగస్టర్ అతీక్ అహ్మద్‌ నేర చరిత్ర ఘనమైందే. అతడిపై కిడ్నాప్, హత్య, దోపిడీ సహా 100కిపైగా కేసులు ఉన్నాయి. జైల్లో ఉండగానే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై 2018లో దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2019 నుంచి గుజరాత్ జైల్లో ఉన్న అతీక్ అహ్మద్‌ను విచారణ కోసం ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు.


అతీక్ అహ్మద్, అతడి కుటుంబ సభ్యుల హత్యలు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా నేరస్థులను నిర్మూలించే నమూనాలో భాగమని పేర్కొంటూ సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం 2017లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని తివారీ కోరారు.


హత్యలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరిన కోర్టు.. హత్యలపై విచారణలో తీసుకున్న చర్యలను సూచిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. హత్యలకు ముందు జరిగిన సంఘటనకు సంబంధించి తీసుకున్న చర్యలు, జస్టిస్ బిఎస్ చౌహాన్ కమిషన్ నివేదిక తర్వాత తీసుకున్న తదుపరి చర్యలను కూడా బహిర్గతం చేయాలని తెలిపింది. 2020లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని కమిషన్‌ను ఏర్పాటు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com