ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫెయిల్‌ అయ్యాడనే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 02:55 PM

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన మురళీ రాఘవ(17) గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయవాడలోని కార్పొరేట్‌ కళాశాలలో చదువుతూ సబ్జెక్టులో ఫెయిల్‌ కావటంతో, అవమానంగా భావించి ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చిల్లకల్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com