వెనిగండ్ల రాము సేవాకార్యక్రమాలు అభినందనీయమని మాజీ ఐ. ఎఫ్. ఎస్ అధికారి కాకొల్లు భస్మాకరరావు అన్నారు. బుధవారం స్థానిక వెనిగండ్ల కార్యాలయంలో కళ్ళజోళ్ళు పంపిణీలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రాము చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఉన్నత విద్యను అభ్యసించటం ద్వారానే సేవ చేయాలన్న ఆలోచనలు వస్తాయన్నారు. పేదలను ఉద్దరించాలన్న ఆలో చన చాలా గొప్పదన్నారు. ఇటువంటి సేవలు వెనిగండ్ల రాము మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి చల్లగుళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర రావు, సర్పంచ్లు సింగాల రాధాకృష్ణ, కైలే సుబ్బారావు, నాయ కులు గుత్తా చంటి, ప్రభాకరరెడ్డి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.