ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులపైకి దూసుకొచ్చిన కారు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:28 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్​ లోని హోషంగాబాద్ ​లో​ రోడ్డుపై నిల్చున్న పోలీసులపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. కారును గమనించిన ముగ్గురు పోలీసులు వెంటనే పక్కకు జరిగారు. బైక్​ పై ఉన్న ధరమ్​రాజ్ అనే కానిస్టేబుల్​ ను కారు ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ధరమ్​రాజ్​ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు పక్కకు జరగడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సీసీటీవీలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు వైరల్ గా మారాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com