పిట్లం అంబేడ్కర్ చౌరస్తా వద్ద సోమవారం టీఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహణం ఢీ కొనడంతో పిట్లంకి చెందిన ప్రశాంత్ కు తీవ్ర గాయాలు తగిలాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు.
పిట్లం నుండి ప్రశాంత్ బైక్ పై బాన్సువాడ వైపు వెళ్తుండగా బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పిట్లం బస్టాండ్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.