పటాన్ చెరు పరిధిలోని బండ్లగూడలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలకు 1. 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. స్మశాన వాటికల ప్రహరీ గోడ పనులను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలోనే నిధులు మంజూరైన ఎన్నికల కోడ్ రావడంతో పనులు జరగలేదని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.