మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ ఎంపీడీఓ, తహసిల్దార్ కార్యాలయాలను, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశుధ్యంలో భాగంగా వెంటనే బహిరంగ ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేసి తక్షణమే వాటిని శుభ్రం చేయించాలని ఆదేశించారు.