సున్నా వడ్డీతో వ్యాపారానికి రూ. 10 లక్షలు రుణం ఇస్తామని ఆశ చూపి రూ. 89వేలు కొట్టేసిన ఘటన వనపర్తి జిల్లా చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ వివరాల ప్రకారం. అమరచింత వాసి వెంకటరమణ ఫేస్బుక్లో "సున్నా వడ్డీతో వ్యాపారానికి రూ. 10 లక్షలు కావాలా? " ప్రకటన చూసి, వివరాలు నమోదు చెయ్యగా. జిఎస్టి, రుణ ప్రాసెస్, ఇతర ఖర్చుల పేరుతో రూ. 89 వేల వరకు కట్టించుకున్నారు. తర్వాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.