ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో వనపర్తి జిల్లాలోని జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఉన్నట్లు ఆదివారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో జలాశయం 41గేట్లు ఎత్తి 2. 90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 7. 62 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి నిల్వ 9. 65 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం 317. 49 మీటర్లు పూర్తిస్థాయి నీటిమట్టం 318. 51 మీ. ఇన్ ఫ్లో 39, 338 క్యూసెక్కులు.