జగిత్యాల రూరల్ మండలం ధరూర్ - అంతర్గమ శివారులో ఎస్సారెస్పీ కెనాల్ గట్టు వద్ద మంగళవారం గుర్తు తెలియని యువకుడి డెడ్ బాడీ లభ్యం అయ్యింది. యువకుడి మృతదేహం సగం కాలినట్టు ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.