నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్ నగర్ కాలనీకి చెందిన గిరిజన నేత కాట్రావత్ శ్రీరామ్ నాయక్ బిఆర్ఎస్ పార్టీ నుండి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీకి కట్టుబడి ఉండి పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, పవన్, చంటి, చిన్న, తదితరులు చేరారు.