నల్లగొండ పట్టణంలోని కామేశ్వరరావు కాలనీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో దేవి మాత, లక్ష్మీ గణపతి, ఉమామహేశ్వర స్వామి, ఆలయ నూతన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సిహెచ్ మోహన్ మాట్లాడుతూ.. భక్తుల కోర్కెలు తీర్చే ఉమామహేశ్వర స్వామి దేవాలయం నూతన ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని కోరారు.