సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద నిలిపి ఉన్న స్కూటీలోకి పాము దూరింది. పాతబస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీని తన షాప్ ముందు పార్క్ చేశాడు. అయితే అందులోకి పాము దూరింది. పనిమీద బయటకు వెళ్లేందుకు షబ్బీర్ స్కూటీ స్టార్ట్ చేయబోగా.. అందులో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏంటా అని చూడగా.. పాము దూరింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన షబ్బీర్ దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవటంతో స్నేక్ క్యాచర్‌ను పిలిపించాడు. అతడి వల్ల కూడా కాకపోవటంతో పక్కనే ఉన్న మోకానిక్ సాయంతో స్కూటీ పార్ట్స్ ఒక్కొక్కటిగా ఊడదీశారు. అనంతరం స్కూటీ స్టార్ చేయగా.. ఇంజిన్ శబ్దానికి పాము బయటకు వచ్చింది. అనంతరం దాన్ని బంధించి నిర్మానుష్య ప్రాంతంలో వదలిపెట్టారు. ఇంటి ఆవరణలో లేదా ఖాళీ స్థలాలలో ఎక్కువ సేపు వాహనాలు పార్క్ చేసేవాళ్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఇది వర్షాకాలం కాబట్టి పాములు, విషపూరిత జీవులు వాహనాల్లోకి దూరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వాహనాలు స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకొని ప్రయాణాలు మెుదలు పెడితే మంచిది.