నారాయణపేట సరిహద్దులో పోలీసులు రేపు కర్ణాటక ఎన్నికలు ఉండటంతో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం సిఐ రవిబాబు జలాల్ పూర్, ఎక్లాస్ పూర్ గ్రామాల్లో వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటి వస్తువులు, మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు పటిష్టంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. బుధవారం సాయంత్రం వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు.