ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 08:25 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "దసరా" సినిమా శాటిలైట్  రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జులై  28, 2024న మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీలో ప్రదర్శించబడుతుందని సమాచారం. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, ఝాన్సీ, సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com