ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్త్ వాళ్లు కూడా తమన్నా స్టెప్పులకు ఫిదా..

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 07:43 PM

కొన్ని మాటలు గాలికన్నా వేగంగా ట్రావెల్‌ చేస్తుంటాయి. మొన్నటికి మొన్న సౌత్‌లో తమన్నా ఐటమ్‌ సాంగ్‌ గురించి ఓ మాట వినిపించింది. ఇప్పుడు నార్త్ లో అదే మాటను నిజం చేసి చూపించారు మేకర్స్.సౌత్‌ మాటను తప్పుబట్టినవారు నార్త్ లో వాస్తవంలోకి వచ్చినందుకు చూసి ఆనందిస్తున్నారు. తమన్నానా మజాకా? అట్లుంటది మరి ఆమెతో.! వా నువ్‌ కావాలయ్యా అని తమన్నా ఈ మధ్య ఆడిపాడిన సాంగ్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.అప్పటిదాకా ఏమాత్రం బజ్‌ లేని ప్రాజెక్టుకు ఆ ఒక్క పాటే ఎక్కడ లేని హైప్‌ తీసుకొచ్చింది. అందుకే లో ఏం లేకున్నా తమన్నాతో ఓ సాంగ్‌ చేయిస్తే చాలని అన్నారు తమిళ తంబిలు.వా నువ్ కావాలయ్యా ఇంపాక్ట్ ఆ రేంజ్‌లో ఉంది మరి.. సౌత్‌లో ఆమెకున్న క్రేజ్‌ని గమనించారేమో... నార్త్ వాళ్లు కూడా తమన్నా స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.శ్రద్ధా కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావు జంటగా నటిస్తున్న లో తమన్నా సాంగ్‌ని ఇంక్లూడ్‌ చేశారు. తమన్నా స్టెప్పులు చూసి ఇన్నాళ్లూ ఈ బ్యూటీ సౌత్‌కే ఎందుకు పరిమితమయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి నార్త్ సైడ్‌ నుంచి.


పొరుగు భాషల్లోనే కాదు.. తెలుగులోనూ తమన్నా స్పెషల్‌ సాంగులకు ఎప్పుడూ క్రేజ్‌ ఉంది. టాప్‌ హీరోల ల్లో పాటలంటే ఎప్పుడూ నో చెప్పలేదు ఈ బ్యూటీ.ఓ వైపు పక్కా కమర్షియల్‌ లు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి పాటలతో మెప్పిస్తూనే ఉన్నారు. త్వరలో తెలుగులో మరో సారి కాలు కదిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com