ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'స్కంద' హిందీ వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 05:35 PM

పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద ది ఎటాకర్' యొక్క హిందీ వెర్షన్ ఇటీవలే యూట్యూబ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యూట్యూబ్ ఇండియాలో 100M+ వ్యూస్ ని మరియు 1.1M+ లైక్స్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com