ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'తిరగబడరా సామి' టైటిల్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 05:25 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'తిరగబడరా సామి' తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ సాంగ్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో రఘుబాబు, బిత్తిరి సత్తి, మరియు రాచ రవి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రను పోషిస్తుండగా, మన్నారా చోప్రా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి భోలే షావలి సంగీతం సమకూర్చారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com