ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాబిన్‌హుడ్' విడుదల వాయిదా పడనుందా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 05:18 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో నటుడు నితిన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ థ్రిల్లింగ్ సినిమాకి 'రాబిన్‌హుడ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ 20, 2024న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు రాబిన్‌హుడ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గాసిప్ ప్రకారం, మేకర్స్ ఫిబ్రవరి 2025 విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా లేటెస్ట్ టాక్. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com