ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లక్కీ బాస్కర్' టైటిల్ ట్రాక్ విడుదలకి తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 04:54 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ ట్రెక్ ని జులై 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 7, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com