ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ తేదీని లాక్ చేసిన 'మంగళవరం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 04:46 PM

అజయ్ భూపతి దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవరం' సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా జులై 26న రాత్రి 9:30 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com