ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రేండింగ్ లో 'స్వాగ్' లోని సింగారో సింగ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 08:17 PM

టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు తన తదుపరి ప్రాజెక్ట్ ని హసిత్ గోలితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కామెడీ ఫాంటసీ డ్రామాకి స్వాగ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ని సింగారోసింగ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య, దక్ష నాగర్కర్, సునీల్, రవి బాబు, శ్రీను, గోపరాజు రమణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ బజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com